Home Entertainment ఒక్క గంట‌లో 11 శాతం‌ పోలింగ్‌..హౌ హైద‌రాబాద్?

ఒక్క గంట‌లో 11 శాతం‌ పోలింగ్‌..హౌ హైద‌రాబాద్?

122
0

గ్రేట‌ర్ ఎన్నిక‌ల పోలింగ్ తుది లెక్క తేలింది. మొత్తం 46.6 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు ఈసీ ప్ర‌క‌టించింది. గ‌తంలోని గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కంటే ఈసారి పోలింగ్ శాత‌మే రికార్డ్ అని చెబుతోంది. అయితే సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కూడా  36.73 శాతానికే ప‌రిమిత‌మైన పోలింగ్.. ఒకే ఒక్క గంట‌లో 11 శాతం పెర‌గ‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

6 గంట‌ల వ‌ర‌కూ క్యూ లైన్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు వేసే అవకాశం  పేరుతో.. అధికార పార్టీ అక్ర‌మాలు చేసి ఉంటుంద‌ని విప‌క్ష పార్టీలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. చివ‌రి గంట‌లో ఎంత కాద‌న్న రెండో, మూడో శాతం పెర‌గొచ్చు కానీ.. అంత‌కంటే ఎక్కువ పెరిగితే క‌చ్చితంగా అది రిగ్గింగ్​గానే భావించాల్సి వస్తుందని విఠ‌ల్, మ‌ధుయాష్కి వంటి నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పోలింగ్ ముగిసే ముందు జిల్లాల నుంచి తీసుకొచ్చిన టీఆర్ఎస్ నేత‌ల‌ని క్యూ లైన్‌లో నిల‌బెట్టి.. దొంగ ఓట్లు వేయించార‌ని వారు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు ఖాళీగా ఉన్న‌ట్టు రోజంతా అన్ని ప్ర‌సార‌ మాధ్య‌మాల్లోనూ ప్ర‌చారం జ‌రిగింద‌‌ని.. సాయంత్రం వ‌ర‌కూ ఓట‌ర్లు వేచి చూసే అవ‌కాశం లేద‌ని వారు అంటున్నారు. చివ‌రి గంట పోలింగ్ శాతంపై  విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here