Home Local News హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో మ‌రో దిశ ఘ‌ట‌న‌

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో మ‌రో దిశ ఘ‌ట‌న‌

232
0

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని ప‌హాడీష‌రీఫ్ లో మ‌రో దిశ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఆటోడ్రైవ‌ర్ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. పహాడీష‌రీఫ్ నుండి చాంద్రాయ‌ణ‌గుట్ట‌కు వెళ్లేందుకు రాత్రి 11గంట‌ల‌కు యువ‌తి ఆటో ఎక్కింది. యువ‌తిపై క‌న్నేసిన ఆటో డ్రైవ‌ర్ ఫిరోజ్ అత్యాచార‌య‌త్నం చేయ‌గా యువ‌తి ప్ర‌తిఘ‌టించింది.

యువ‌తి ప్ర‌తిఘ‌టిస్తుండ‌టంతో ఫిరోజ్… ఆమెను స్క్రూ డ్రైవ‌ర్ తో పొడిచి హ‌త్య చేశాడు. మ‌హిళ ఆన‌వాళ్లు గుర్తుప‌ట్ట‌కుండా దుస్తులు తొల‌గించిన డ్రైవ‌ర్… వాటిని త‌గ‌ల‌బెట్టాడు. ముఖంపై ఇటుక‌తో మోదీ… గుర్తుప‌ట్ట‌రాకుండా చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు హ‌త్య కేసును చేధించారు. ఫిరోజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here