Home Entertainment ప‌వ‌ర్‌స్టార్‌తో త‌మ‌న్, త్రివిక్ర‌మ్‌

ప‌వ‌ర్‌స్టార్‌తో త‌మ‌న్, త్రివిక్ర‌మ్‌

114
0

థమన్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. ”శక్తి మరియు ఆనందం.. భీమ్లానాయక్ మాస్. నా ప్రియమైన దర్శకుడు త్రివిక్రమ్ గారు & మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు!!” అని దీనికి క్యాప్సన్ పెట్టాడు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో పవన్ ఎప్పటిలాగే సింపుల్ గా పంచె కట్టులో ఉండగా.. తమన్ – త్రివిక్రమ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. పవర్ స్టార్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందించాలనే కోరికను ‘వకీల్ సాబ్’ తో తీర్చుకున్నాడు ఎస్ ఎస్ థమన్. ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని మిస్ చేసుకున్న తమన్.. ఇన్నేళ్లకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పవన్ కోసం అద్భుతమైన మ్యూజిక్ అల్బమ్ అందించి సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించాడు. అయితే ఈ ఛాన్స్ రావడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని తమన్ పలు సందర్భాల్లో వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here