Home Entertainment వాణీక‌పూర్ రేంజ్ మామూలుగా లేదుగా..

వాణీక‌పూర్ రేంజ్ మామూలుగా లేదుగా..

172
0

`ఆహా కళ్యాణం` బ్యూటీ వాణీ కపూర్ హిందీ చిత్రసీమలో ఎదురే లేని హవా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో ఈ సోగకాళ్ల సుందరి ఓ వెలుగు వెలుగుతోంది. యష్ రాజ్ బ్యానర్ లోనే వరుస పెట్టి సినిమాలకు సంతకాలు చేస్తున్న వాణీ.. ఇండస్ట్రీ బెస్ట్ హీరోల సరసన నటిస్తూ సత్తా చాటుతోంది.\
వాణీ ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి అడుగుపెట్టబోతోంది. అది కూడా సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ప్రభాస్ కి విలన్ గా ఓ ప్రముఖ నటుడిని లాక్ చేశారు. అతడు ఎవరు? అన్నది ప్రశాంత్ ఇంకా రివీల్ చేయలేదు. ఇక ఆ పాత్రకు కథలో చాలా ప్రాముఖ్యత కూడా ఉండబోతుంది. ఇందులో ప్రతి నాయకుడి పాత్రకు కుటుంబ నేపథ్యం…ఓ గొప్ప చరిత్ర కూడా ఉంటుందిట. అతని ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపించింది. అలాగే విలన్ వైఫ్ పాత్ర కూడా కథలో అంతే కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. కీలకమైన విలన్ వైఫ్ పాత్ర కోసం వార్ బ్యూటీ వాణీ కపూర్ ని ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం. వాణీ కపూర్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో కనిపించనుంది.
వాణీ కపూర్ సౌత్ కెరీర్ లో కీలక పాత్రలో అవకాశం అందుకుంది. ఈ ఛాన్స్ తో వాణీ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీతో పాటు వాణీ కపూర్ హిందీలో నటించిన మూడు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
వాణీ బ్యాక్ టు బ్యాక్ నటిస్తున్న ఈ సినిమాల బడ్జెట్లు అసాధారణమైనవి. ఇప్పటికిప్పుడు 1000 కోట్లు పైగా వీటికి పెడుతున్నారు నిర్మాతలు. అలాంటి క్రేజీ ఆఫర్లు వేరొక భామకు దక్కడం అంత సులువేమీ కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here