Home Entertainment వైర‌ల్‌గా నాని స్పీచ్‌

వైర‌ల్‌గా నాని స్పీచ్‌

61
0

ప‌లు ఆస‌క్తిక‌ర సినిమాల‌తో న్యాచుర‌ల్ స్టార్ నాని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఈమ‌ధ్య‌ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ చిత్రం “తిమ్మరసు” ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయిన నాని ఆ చిత్ర యూనిట్ కి తన వంతు సహకారం అందించారు. అయితే ఇదే వేడుక వేదికపై నాని చేసిన పలు ఆస‌క్తిక‌ర‌ కామెంట్లు నెటిజన్స్ కి బాగా కిక్కిచ్చాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో టికెట్ రేట్ పై అసంతృప్తిక‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఇదిలా ఉంటే చాలా మంది హీరోలు మాత్రం మౌనం వ‌హిస్తున్నారు కానీ నాని చేసిన కామెంట్స్ తో మాత్రం మూవీ లవర్స్ పర్ఫెక్ట్ గా ఏకీభవిస్తున్నారు. బయట మనం రోజూ వాడుకునే నిత్యావసర సరుకులు పప్పు, నూనె ధరలు పెట్రోలు రేట్ లు పెరిగిపోతున్నప్పుడు వాటిని తగ్గించాలి కానీ టికెట్ రేట్స్ పై ఏంటని తన మనసులో మాట ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనితో నాని గట్స్ కి హ్యాట్సాప్ అంటూ పలువురు మూవీ లవర్స్ సోషల్ మీడియాలో నాని మాటలను స‌మ‌ర్థిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here