Home Entertainment RC15 చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా

RC15 చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా

68
0

‘#RC15’ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించనుందని మేకర్స్ వెల్లడించారు. ఈరోజు కియరా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. నిర్మాణ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లోకి ఆమెకు స్వాగతం పలికింది. శంకర్ – కియరా ఇద్దరూ చర్చించుకుంటున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా “ఇది ఖచ్చితంగా నేను ఇప్పటివరకు పొందిన బెస్ట్ బర్త్ డే బహుమతులలో ఒకటి. సినీ ఇండస్ట్రీలోని ప్రఖ్యాత మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులతో కలసి పనిచేయడానికి నేను సంతోషిస్తున్నాను” అని కియరా పేర్కొన్నారు.

కాగా రామ్ చరణ్ తో కలిసి ఇంతకముందు ‘వినయ విధేయ రామా’ చిత్రంలో కియరా అద్వానీ ఆడిపాడింది. ఈ క్రమంలో ఇప్పుడు RC15 కోసం మరోసారి జోడీ కట్టనున్నారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ప్ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాస్తున్నారు. శంకర్ – చరణ్ కాంబోలో రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో పట్టాలెక్కించనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here