Home Entertainment స‌లార్ లో ఆక‌ట్టుకోనున్న భారీ యాక్ష‌న్ సీన్స్‌

స‌లార్ లో ఆక‌ట్టుకోనున్న భారీ యాక్ష‌న్ సీన్స్‌

142
0

ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో శ్రుతీహాసన్‌ కూడా జాయిన్‌ అయ్యారని సమాచారం. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కొంత నైట్‌ షూట్‌ కూడా జరుగుతోంది.

ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకోసం విలన్‌ ఉండే ఓ డెన్‌ సెట్‌ను తయారు చేయించారట. ప్రభాస్‌ పాల్గొనే ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాలో ఓ హైలైట్‌గా ఉంటుందట. ఈ ఫైట్‌ సీన్‌ ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చే విధంగా ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here