టాలీవుడ్‌లో పెద్ద‌న్న‌గా అవ‌తార‌మెత్తిన రజ‌నీ!

  61
  0
  Rajanikanth

  సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం అన్నాథే. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా ఈ రోజు ద‌స‌రా సంద‌ర్భంగా తెలుగులో పెద్ద‌న్న అనే టైటిల్‌తో తెర‌కెక్కుతుంద‌ని చిత్ర‌యూనిట్ ఒక పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ర‌జ‌నీ చాలా స్టైలిష్‌గా లుంగీతో క‌త్తి ప‌ట్టుకుని బైక్‌పై మాస్ లుక్‌లో ఉన్నాడు.

  ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. ఇక ఈ చిత్రంలో పెద్ద‌న్న ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్‌గా.. అలాగే కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాశ్‌రాజ్ త‌దిత‌ర న‌టీన‌టులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఏషియ‌న్ ఇన్‌ఫ్రా ఎస్టేట్స్ ఎల్ ఎల్‌పీ నారాయ‌ణ‌దాస్ నారంగ్, సురేశ్‌బాబు తెలుగు, త‌మిళ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

  వ‌చ్చే నెల దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇదిలా ఉంటే.. ఈ చిత్రం షూటింగ్ స‌మ‌యంలోనే ర‌జ‌నీ అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే. కానీ ఈ వ‌య‌సులో కూడా ర‌జనీ త‌న స్టైల్‌తో, డైలాగ్‌, ఫైటింగ్‌ల‌తో అభిమానులను అల‌రిస్తున్నాడు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here