తెలంగాణ‌ యాస‌లో డైలాగ్ అద‌ర‌గొట్టిన‌ నాని..

  76
  0
  Nani

  నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెలంగాణ యాస‌తో ఒక సినిమా రాబోతుంది. ఈ రోజు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా త‌న కొత్త సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు రింగుల జుట్టుతో నాని ర‌గ్డ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. వివ‌రాల్లోకి వెళితే.. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ ఓదేల డైరెక్ష‌న్‌లో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించ‌నున్నా ఈ చిత్రానికి ద‌స‌రా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

  ద‌స‌రా పండుగ రోజున ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్ట‌ర్‌ను ఓ వీడియో రూపంలో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో నాని తెలంగాణ యాస‌లో మాట్లాడుతున్నాడు.. ఈ ద‌స‌రా నిరుడు లెక్కుండ‌ది బాంచ‌త్‌.. జ‌మ్మివెట్టి చెబుతున్నా బ‌ద్ద‌ల్ బాసింగ‌లైతాయ్ ఎట్లైతే గ‌ట్లైత‌ది సూసుకుందాం అంటూ నాని త‌న‌దైన శైలిలో తెలంగాణ యాస‌లో ప‌లికిన డైలాగ్ ఎంతో అల‌రిస్తోంది.

  ఇక ఇందులో నాని స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తుండ‌గా.. ఈ చిత్రానికి త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం స‌మ‌కురుస్తున్నారు.. కాగా ఈ చిత్రానికి సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు చిత్ర‌యూనిట్‌. ఇదిలాఉంటే నాని చివ‌రి చిత్రం ట‌క్ జ‌గ‌దీశ్ ఓటీటీ వేదిక‌గా రిలీజ్ అయి ప్రేక్ష‌కుల‌కు ఆశించిన స్థాయిలో అల‌రించ‌కున్న నాని న‌ట‌న ప‌రంగా విమ‌ర్శ‌కుల నుంచి మంచి మార్కులే ప‌డ్డాయి.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here