సిగ‌రెట్ తాగుతూ మాస్ లుక్‌లో ర‌వితేజ‌..

  67
  0
  Mass Maharaj

  మాస్ మ‌హారాజ్ ర‌వితేజ వ‌రుస సినిమాల‌తో మాంచి జోష్ మీదున్నాడు. ర‌వితేజ న‌టించిన గ‌త చిత్రం క్రాక్ టాలీవుడ్‌లో భారీ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ముందు డిజాస్ట‌ర్ సినిమాల‌తో ఇబ్బందిప‌డిన‌.. క్రాక్ చిత్రంతో స‌క్సెస్ ట్రాక్ లోకి ఎక్కాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఫుల్ ఎన‌ర్జీతో ఎక్కువ సినిమాల‌ను ఒప్పుకుంటున్నాడు మాస్ మ‌హారాజా. ప్ర‌స్తుతం మూడు సినిమాలు లైన్లో పెట్టేశాడు.. ఇప్ప‌టికే ఖిలాడీ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకోగా.. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాక్‌స్టార్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

  అలాగే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా సెట్స్‌పై ఉంది.. ఈ సినిమా ఇంకా పూర్తి కాక‌ముందే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు ర‌వితేజ.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రానికి నేడు ద‌స‌రా సంద‌ర్భంగా టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ధ‌మాకా అనేది టైటిల్ కాగా డ‌బుల్ ఇంపాక్ట్ ట్యాగ్‌లైన్‌ను జోడించారు.

  ఈ టైటిల్ పోస్ట‌ర్లో ర‌వితేజ సిగ‌రేట్ తాగుతూ.. వైట్ గ్లాసెస్ పెట్టుకుని మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండ‌గా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here