నేడు కీర్తి సురేశ్ బ‌ర్త్‌డే.. మ‌హేశ్ మూవీ చిత్ర‌యూనిట్ విషెస్‌!

  87
  0
  kirthi

  నేడు టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తిసురేశ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. తెలుగుతో పాటు త‌మిళ్ ప‌లు భాష‌ల్లో న‌టించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న‌ కీర్తి బాల‌న‌టిగా ప‌లు చిత్రాల్లో న‌టించిది కూడా. కీర్తి సురేశ్ ఎవ‌రో కాదు.. సీనియ‌ర్ న‌టి మేన‌క రెండో కూతురు. ఆమె ప్ర‌స్తుతం తెలుగులో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది.

  నేడు కీర్తి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర‌బృందం ఆమెకు విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. దీంట్లో కీర్తి క్యాజువ‌ల్ డ్రెస్ పై డెనిమ్స్ ధ‌రించి స్మైలీ లుక్‌లో ఎంతో క్యూట్‌గా క‌నిపించింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తుండ‌గా..

  గీతా గోవిందం ఫేం ప‌రుశురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఇక స‌ర్కార్ వారి పాట చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా కీర్తీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా SUGUNA TV త‌ర‌పున హ్యాపీ బ‌ర్త్ డే క్యూటీ కీర్తీ సురేశ్.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here