వెంకీ మామతో దిగిన ఫోటోను పంచుకున్న వ‌రుణ్‌..

  72
  0
  venki

  విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం ఎఫ్‌3. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక వీరి కాంబోలో వ‌చ్చిన ఎఫ్‌2 చిత్రం ప్రేక్ష‌కుల్లో న‌వ్వులు పూయించి ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్ మెంట్‌తో ఎఫ్‌3 సినిమా రాబోతుంది. ఇప్ప‌టికే శ‌ర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్ర‌ణాళిక వేసింది.

  ఇక తాజాగా వ‌రుణ్‌తేజ్ వెంక‌టేశ్‌తో క‌లిసి దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ఎఫ్‌3 షూటింగ్ లాంగ్ షెడ్యూల్ పూర్త‌యింద‌ని వ‌రుణ్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో వెంకీ, వ‌రుణ్ ఇద్ద‌రు ఎఫ్‌3 షూటింగ్ సెట్స్‌లో ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ముచ్చ‌టించుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి..

  వెంకీ, మెగాభిమానులు ఎంతో ఫిదా అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో వెంక‌టేశ్ స‌ర‌స‌న మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ్రీన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.. ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ వెల్ల‌డించాల్సి ఉంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here