సోష‌ల్ మీడియాలో ష‌ణ్ముఖ్ పై నెటిజ‌న్స్ ట్రోల్స్‌..

  92
  0
  shanmukh latest

  బిగ్‌బాస్‌-5 ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ఈ క్ర‌మంలో హౌస్‌లో చోటు చేసుకున్న ప‌రిణామాలు మాత్రం నెటిజ‌న్ల‌కు చేతినిండా ప‌నిస్తున్నాయి. ఇప్ప‌టికే బిగ్‌బాస్‌కి సంబంధించి అనేక మీమ్స్ సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్పుడు షోకి సంబంధించిన ప్ర‌తి విష‌యం కూడా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక తాజాగా బిగ్‌బాస్‌లో మొట్ట‌మొద‌టి సారిగా బిగ్‌బాస్‌-5 కంటెస్టెంట్ ష‌ణ్ముఖ్ స‌బ్ టైటిల్స్ వేయించాడు. నిన్నటి ఎపిసోడ్‌లో స‌న్నీ-సిరిల మ‌ధ్య గుడ్ల కోసం జ‌రిగిన పోటీలో మ‌రో అమ్మాయి ఉంటే నా చేయి విరిగిపోయింది.

  నన్ను అలా చేశారు. ఇలా చేశారు అని ఏడ్చేది.. నువ్వు పోటీగా తీసుకున్నావు. ఈ వారం నిన్ను తీసేస్తే.. తీసేయొచ్చు అని సిరితో షణ్ముఖ్ అన‌గా ఏడు వారాలు ఉన్నాను.. వెళ్లిపోతే పోతా అని సిరి క్యాజువ‌ల్‌గా తీసుకుంది. అయితే జెస్సికి బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వ‌గా దానికి సిరి హెల్ప్ తీసుకున్నాడు జెస్సి. ఈ టాస్క్ విష‌యంలో బిగ్‌బాస్ నాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వండి అని ష‌ణ్ముఖ్ అడిగితే ర‌వి మ‌ధ్య‌లో అరే నువ్వు ముందు టాస్క్ బాగా ఆడు అనేస‌రికి ష‌ణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు.

  ఈ విష‌యం మీద సిరి, ష‌ణ్ముఖ్ గొడ‌వ ప‌డ్డారు. ఈ టాస్క్‌లో త‌న‌ని ఉప‌యోగించుకుని జెస్సి, సిరి గేమ్ ఆడ‌డం ష‌ణ్ముఖ్ జీర్ణించుకోలేక‌పోతున్నాడు. అక్క‌డ వాళ్లంద‌రూ నువ్వు టాస్క్ స‌రిగా ఆడు అంటున్నారు. ఈ వెధ‌వ డైలాగ్స్ నేను వినాలి అంటూ సిరితో అన‌డం సంచ‌ల‌నంగా మారింది. అయితే నువ్వు ఫ్రెండ్ అని ఫీల‌య్యా కాబ‌ట్టే నీ ద‌గ్గ‌రికి వ‌చ్చా అని సిరి అంటే.. నన్ను వెధ‌వ‌ని చేసావ్.. నాకు గేమ్ ఆడ‌డం కూడా రాదు అది నా ద‌రిద్రం అంటూ షణ్ముఖ్ ఫీల‌వుతున్నాడు. ఓదారుస్తున్న సిరి.. అరే నువ్వు వెళ్లిపోరా ఇక్క‌డినుంచి అంటు చెప్ప‌డంతో సిరి వెళ్లిపోయింది.

  ఒంట‌రిగా ష‌ణ్ముఖ్ ఏడుపు స్టార్ట్ చేశాడు..అలాగే సిరి, జెస్సిలు కూడా ఏడుపులు మొద‌లు పెట్టారు. కాగా ష‌ణ్ముఖ్ చేసిన ప‌ని ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. ఎందుకంటే తెలుగు బిగ్‌బాస్ చ‌రిత్రలో ఇప్ప‌టిదాకా ఎవ‌రికి స‌బ్ టైటిల్స్ వేయ‌లేదు. కానీ రాత్రి ప‌డుకునే ముందు సిరితో ష‌ణ్ముక్ మాట్లాడిన మాట‌లు మ‌నం విన‌డం కోసం ఏకంగా స‌బ్ టైటిల్స్ వేశారు. అయితే జెస్సి విష‌యంలో ష‌ణ్ముఖ్ రియాక్ష‌న్ స‌రిగా లేద‌ని సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here