హుజురాబాద్ ఎన్నికలపై కార్య‌క‌ర్త‌ల‌కు రేవంత్ కీల‌క సూచ‌న‌లు..

  109
  0
  revanthanna

  హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఇంటికో ఓటు కాంగ్రెస్‌కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల‌ని నేత‌ల‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి సూచించారు. జూమ్ మీటింగ్‌లో హుజురాబాద్ ఎన్నిక‌ల ఇంఛార్జీలు, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌తో రేవంత్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. నిరుద్యోగ యువ‌త, విద్యార్థుల‌ను, కొత్త ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా ప్ర‌చారం ఉండాల‌ని తెలిపారు. వ‌చ్చే వారం రోజుల పాటు చేయాల్సిన ప్ర‌చార వ్యూహాల‌ను నాయ‌కుల‌తో చ‌ర్చించారు.

  కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయ‌కుడికి, విద్యార్థి నేత‌కు టికెట్ ఇచ్చి ప్రోత్సాహించిన విష‌యాన్ని యువ‌త‌లోకి తీసుకెళ్లాల‌న్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలి. బీజేపీ, టీఆర్ఎస్ ల మోస‌పూరిత విధానాలు, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్ధానాలు, చేసిన న‌ష్టాల‌ను వివ‌రించాలి. ఈ ఉప ఎన్నిక‌ల‌కు కార‌ణం ఏంటీ?ఎవ‌రు? ద‌ళిత బంధును అడ్డుకున్న‌దెవ‌రు? ఇచ్చిన మాట‌లు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను వంచించింది ఎవ‌రు? అనే విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి లోతుగా తీసుకెళ్లాల‌ని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here