బిగ్‌బాస్ షో నిర్వాహ‌కుల‌పై ఫిర్యాదు చేసిన ప్రియ

  183
  0
  priya latest

  బిగ్‌బాస్‌-5 ప్రియ ఎలిమినేట్ అయిన త‌ర్వాత ఆ షో నిర్వాహ‌కుల‌పై కంప్లైంట్ ఇచ్చింది. ఈ షోలో అస‌మంజ‌మైన కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి అని ప్రియ ఫిర్యాదు చేసిన‌ట్లు వార్తాలు వెలువ‌డుతున్నాయి. కొంద‌రు కంటెస్టెంట్లు బ‌య‌ట వ్య‌క్తుల సపోర్ట్‌తో షోలో ఆడుతున్నార‌ని, నిజాయితీగా గేమ్ ఆడేవారు ఎలిమినేట్ అవుతున్నారని ప్రియ త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

  దీనిపై అధికారికంగా ఎక్క‌డా వెల్ల‌డి కాక‌పోవ‌డంతో అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రియ త‌న 18సంవ‌త్స‌రాలకే సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో తెలుగు చిత్రాల్లో న‌టించి మెప్పించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంక‌టేశ్‌, నాగార్జున‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ల‌తో

  న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల్లో అప్ప‌ట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ‌. అలాగే బాలీవుడ్‌లో లెజండ‌రీ న‌టుడు బిగ్‌బితో కూడా ఆమె న‌టించింది. ప్ర‌స్తుతం ప్రియ ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టిస్తుండ‌గా.. సినిమాల్లో అవ‌కాశం ఉంటే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని ప్రియ తెలిపిన‌ట్లు స‌మాచారం.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here