రెడ్ కార్పెట్‌పై హోయ‌లు ఒలికిస్తున్న సుంద‌రి ర‌ష్మిక‌..

  94
  0
  rashmika

  టాలెంట‌డ్ ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్నా సైమా 2021వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. రెడ్ డిజైన‌ర్ వేర్‌లో రెడ్ కార్పెట్‌పై ర‌ష్మిక హోయ‌లు ఒలికించింది. 2019సంవ‌త్స‌రానికి గాను సైమా అవార్డ్స్ ప్ర‌క‌టించ‌గా ఉత్త‌మ న‌టి క్రిటిక్స్ విభాగంలో టాలీవుడ్ నుంచి అవార్డు అందుకుంది ఈ చిన్న‌ది. డియ‌ర్ కామ్రేడ్ చిత్రానికి గాను ఆమెకు ఈ అవార్డు ద‌క్కింది.

  అయితే ర‌ష్మిక బ్యూటీ వేసుకున్న డ్రెస్ ఆమె అందానికి వ‌న్నె తీసుకొచ్చింది.. రెడ్ డ్రెస్‌లో ధ‌గ ధగ మెరుస్తూ అందాలు ఆర‌బోసింది. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 21మిలియ‌న్స్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఆమె న‌టించిన చిత్రాల్లో ఒక‌టి రెండు మిన‌హ మిగ‌తా అన్నీ చిత్రాలు విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌తో జోడీగా పుష్ఫ సినిమాలో న‌టిస్తుంది.

  ఇందులో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా .. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో చిత్రాల్లో న‌టిస్తుంది. బాలీవుడ్‌లో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా మిష‌న్ మ‌జ్ను సినిమాలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here