నేడు ఇలియానా బ‌ర్త్‌డే.. మ‌ళ్లీ త‌న నాజూకు షోకుల‌తొ తెర‌పై ఇల్లీబెల్లీ!

  99
  0
  illeana

  గోవా బ్యూటీ ఇలియానా సైజ్ జీరో అందాలు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్‌లొ దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇక నేడు ఇలియానా 35వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. గోవా బ్యూటీ ఇలియానా..‘దేవదాసు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఇలియానా తన నడుమందాలతో తెలుగు యూత్‌కు నిద్ర లేకుండా చేసింది.

  దేవదాసు మంచి విజయం అందుకోవడంతో ఆ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒకే సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది ఇలియానా. ఓ పక్క ఇటు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా అదరగొట్టింది. అందులో భాగంగా ఈ భామ అక్కడ ‘బర్ఫీ’, ‘పటా పోస్టర్ నిఖలా హీరో’, ‘మెయిన్ తెరా హీరో’, ‘రుస్తుం’ లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్‌లు అందుకుంది.

  ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో.. గతేడాది రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. మహేష్ బాబు పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. ఇక పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా కాలం పాటు ఇలియానా టాలీవుడ్‌ను ఏలిందనే చెప్పోచ్చు.

  కుర్ర హీరోలతో పాటు సీనియర్స్ ఇలియానాతో ఆడిపాడారు. ఎక్కడ చూసినా ఇలియానా మానియా కనిపించేది. అంతలా ఇలియానా తన నాజూకు అందాలతో వెండితెరని హీటెక్కించింది.. అయితే ఇలియానా మానియా కొన్నాళ్లు సాగిన తర్వాత.. గోవా బ్యూటీ ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్‌తో ప్రేమలో పడింది. అంతేకాదు కొంతకాలం ఈ జంట సహజీవనం కూడా చేసిందటారు. కొన్నాళ్ల తర్వాత ఏవో కారణాల వలన ఊహించని విధంగా విడిపోయారు.

  దీనితో చాలా కాలం పాటు ఇలియానా డిప్రెషన్ లో ఉన్నట్లు గతంలో తెలిపింది. కొన్నాళ్లకు ఆ డిప్రెషన్‌ను నుంచి బయటకు వచ్చిన ఇలియానా ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రవీణ్ సత్తారు, నాగార్జున ఘోస్ట్‌లో ఇలియానా కీలకపాత్రలో కనిపించనుందని అంటున్నారు. కాజల్ చేయాల్సిన పాత్రలో ఇలియాన నటించనుందని సమాచారం.

  illi

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here