హాట్ ఫైర్ బ్రాండ్ ప్ర‌గ‌తి పిక్స్ చూస్తే దిమ్మ‌తిరిగిపోవాలా..

  119
  0
  pragathi anty

  టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయగల ప్రగతి నటన, చాలా సహజంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. మరి అలాంటి ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే మాత్రం అసలు ఆమె ఈమేనా అని భావన కలుగుతుంది. వెండితెరపై అంబాసిడర్ కార్ లా కనిపించే ప్రగతి, ఇంస్టాగ్రామ్ వీడియోలలో బెంజ్ కారు రేంజ్ ఫోజులిస్తారు. ఆమె డిస్కో డాన్సర్ మాదిరి ఫాస్ట్ బీట్ కి స్టెప్స్ వేస్తారు.

  ప్రభుదేవా కూడా ఈమె డాన్స్ చూసి ముక్కున వేలు వేసుకోవాల్సిందే. తరచుగా ట్రెండీ సాంగ్స్ కి ప్రగతి ఓ డాన్స్ వీడియో చేయడం ఆనవాయితీ గా మారిపోయింది. మరోవైపు ఫిట్నెస్ ఫ్రీక్ అవతారం ఎత్తింది. జిమ్ సూట్ ధరించి కఠిన కసరత్తులు చేస్తూ ఉంటారు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అసలు ప్రగతి ఎనెర్జీ చూస్తే, యంగ్ ఫెలోస్ కూడా ఈర్ష్య పడాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె వర్కవుట్స్ ఉంటాయి. ఇక ప్రగతి వీడియోలను నెటిజెన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో మీకు ఇవ్వన్నీ అవసరమా? హీరోయిన్ అవుదామనుకుంటున్నావా? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

  సదరు నెగిటివ్ కామెంట్స్ పై ప్రగతి స్పందిస్తారు కూడా. మీ లాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోను, నా ఆరోగ్యం కోసం నేను వ్యాయామం చేస్తున్నా, అంటూ బదిలిస్తారు. ప్రగతిలో ఈ మార్పు కేవలం కొన్నాళ్ల నుండి మాత్రమే మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాక, ఈతరహా వీడియోలు చేయడం ప్రారంభించారు. సొసైటీని పట్టించుకోకుండా, నచ్చిన లైఫ్ లీడ్ చేయడమే బెటర్ , అనే సూత్రాన్ని ఆమె అవలంబిస్తున్నారు. తాజాగా ప్రగతి పోస్ట్ చేసిన ఓ వీడియో చూస్తే.. గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉంది. ఆమె ఫ్రాక్, టాప్ ధరించి క్యాట్ వాక్ చేశారు.

  సదరు వీడియోలో ప్రగతి స్కిన్ షో బోల్డ్ హీరోయిన్స్ ని మించిపోయింది. ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తైతే, ఇప్పుడు చూసేది ఒక ఎత్తు అన్న భావన కలుగుతుంది. హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక ప్రగతి వీడియో చూసిన నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సెక్సీగా ఉన్నారని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయాలి అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. కుర్రకారును ఆ రేంజ్ లో రెచ్చగొట్టేలా, ప్రగతి వీడియో ఉంది. వెండితెరపై సాంప్రదాయానికి చీర కట్టినట్లు కనిపిస్తుంది నటి ప్రగతి. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here