Bigboss-5-కాజ‌ల్‌పై డ‌బుల్ మీనింగ్ కామెంట్స్ చేసిన శ్రీ‌రామ‌చంద్ర‌!

    117
    0
    Bigboss

    బిగ్ బాస్-5 హౌస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొన్ని సార్లు కంటెస్టెంట్స్ మధ్యలో వివాదాలు కన్ఫ్యూజన్ కి గురి చేస్తుంటాయి. సోమవారం నామినేషన్ చేసే సమయంలో కూడా అదే తరహాలో అనిపించింది. ఇక నామినేషన్ సమయంలోనే ఓపికతో సమాధానం చెప్పే వారికి మాత్రమే కొన్నిసార్లు కలిసి వస్తూ ఉంటుంది. ఆ విషయంలో శ్రీరామచంద్ర మాత్రం చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పవచ్చు. యాంకర్ రవి మాత్రమే కాకుండా అతను కూడా చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు.

    ఇంతవరకు కూడా అతను హౌస్ లో గొడవలు పడిన సందర్భాల్లో పెద్దగా నెగిటివ్ కామెంట్ అయితే అందుకోలేదు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో ముందుకు సాగుతున్నాడు అయితే మొదటి సారి కాల్ చేసిన కామెంట్స్ కు శ్రీ రామచంద్ర తన ఓపికను సహనాన్ని కోల్పోవలసి వచ్చింది. కాజల్ తరహాలోనే అతను కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ తో షాక్ ఇచ్చాడు. కాజల్ కు ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడాలి..

    కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు. నీకు అలాంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు నాకు కూడా అలానే ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడుతాను అంటూ శ్రీరామచంద్ర సమాధానం ఇచ్చినప్పటికీ కాజల్ అతని ఫేస్ పై క్రీమ్ పోసి నామినేట్ చేసింది. దీంతో నా పుట్టలో వేలు పెట్టాలని అనుకున్నావు తప్పకుండా నేను కూడా నీ పుట్టలో వేలు పెడతాను అంటూ శ్రీరామ్ మరో కౌంటర్ ఇచ్చాడు. ఇక శ్రీరామచంద్ర రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో బిజీ అయ్యాడు అనిపిస్తోంది. మరి వీరి మధ్య రానున్న రోజుల్లో ఏలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందో చూడాలి.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here