చీర‌లో జాన్వీను చూస్తే శ్రీ‌దేవి గుర్తొస్తుంది..

    162
    0

    అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి కూత‌రు జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఆమె ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది. ఈ బాలీవుడ్  అందం ఫోటో షూట్‌లతో పాటు అప్పుడ‌పుడు త‌న వెకేష‌న్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.

    ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ, దోస్తానా2, మిలి వంటి మూడు సినిమాల్లో నటిస్తోంది. జాన్వీ తెలుగు ఎంట్రీ విజయ్ దేవరకొండ లైగర్‌తో ఉంటుందని అందరూ భావించారు.. అయితే ఆ సినిమాలో ఆమె నటించలేదు. ఈ విధంగానే జాన్వీ ఆ మధ్య ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తుందని టాక్ నడిచింది. కానీ ఆ సినిమా కూడా మెటీరిలైజ్ కాలేదు. అది అలా ఉంటే జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో 39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని తెలుస్తోంది.

    ఇండస్ట్రీకి వచ్చింది 2018లో.. చేసింది రెండు సినిమాలు మాత్రమే.. కానీ అప్పుడే 40 కోట్లు పెట్టి ఇల్లు కొనేసింది అంటే జాన్వీని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అంతా ఇదే టాపిక్‌ హాట్ హాట్‌గా నడుస్తుంది. జాన్వీ కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో ఉంది. ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గతేడాది డిసెంబర్‌ 7 జరిగిందని తెలుస్తుంది. ఈ ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు కాగా.. ఈ ఇంటికి సంబంధించి 78 లక్షల రూపాయల స్టాంప్‌ డ్యూటీని జాన్వీ కపూర్ చెల్లించినట్లు బాలీవుడ్ కథనాలు చెప్తున్నాయి.

    Jhanvi

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here