మా అమ్మ అందంగా ఉండాల‌న్న రూల్ ఏమైనా ఉందా.. బండ్ల‌గ‌ణేశ్ ఎమోష‌న‌ల్‌!

  90
  0
  Degala Bandla Ganesh

  ప్రముఖ కమెడియన్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘డేగల బాబ్జీ’ . ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం ఉదయం ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ పూరీ జగన్నాథ్ విడుదల చేశాడు. యష్ రిషి ఫిలింస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో పార్తీబన్ హీరోగా నటించిన ‘ఒత్తుసెరుప్పు సైజ్ 7’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్‌లో ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ‘డేగల బాబ్జీ’ పాత్రలో బండ్ల గణేష్ నటన ఆకట్టుకుంటోంది.

  ఈ ట్రైలర్‌లో ‘అసలు మా అమ్మ అందంగా ఉండాలన్న ఏమైనా ఉందా?’, ‘పుట్టగానే వాడు ఏడవలేదు.. అందుకే వాడు పుట్టినప్పటి నుంచి మేం ఏడుస్తూనే ఉన్నాం’ అనే డైలాగులు బాగున్నాయి. మరోవైపు ఈ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండిస్తూ బండ్ల గణేష్ చూపించిన హావభావాలు మెప్పించేలా ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో దూసుకెళ్తుంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here