ఎద‌లో వాలిపోవా పూజా.. స్ట‌న్నింగ్ లుక్స్‌లో పూజాహెగ్దే!

  84
  0
  Pooja Hegde

  హీరోయిన్ పూజా హెగ్డే.. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. టాప్ హీరోయిన్‌గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది.

  ఇక పూజా హెగ్డే గతంలో చీరలో పూజా చేసిన హాట్ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతుంది ఈ భామ‌. పూజా హెగ్డే అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది. తల్లి దండ్రులది కర్ణాటకలోని మంగళూరు అయినా.. వీళ్లు సెటిల్ అయింది మాత్రం ముంబైలో సెటిల్ అయ్యారు. తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. పూజా పుట్టింది ముంబై అయిన తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని లోని మంగుళూరు. పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు.

  అంతేకాదు పూజా భ‌రతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది.

  తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది.

  Pooja Hegde

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here