ప్ర‌భాస్‌పై బెంగ‌పెట్టుకున్న త‌న మాతృమూర్తి..

  83
  0
  Prabhas Mother

  ప్ర‌భాస్‌.. ఈ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎవ‌రు అడిగినా తెలుస్తోంది. అంత‌లా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు బాహుబ‌లి ప్ర‌భాస్‌. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 2002లో ఈశ్వ‌ర్ సినిమాతో అడుగుపెట్టాడు ప్ర‌భాస్‌. ఆ త‌ర్వాత రాఘ‌వేంద్ర‌, వ‌ర్షం వంటి ప‌లు సినిమాల‌లో న‌టించి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక పాన్ ఇండియా మూవీ బాహుబ‌లి సినిమాతో ఎన‌లేని క్రేజ్ సంపాదించుకున్నాడు ప్ర‌భాస్‌. ఈ సినిమా త‌ర్వాత త‌న త‌దుప‌రి సినిమాల‌న్నీ పాన్ ఇండియా మూవీ తెర‌కెక్కాల‌ని ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్ర‌స్తుతం ప్ర‌భాస్ పాన్ ఇండియా చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ప్ర‌భాస్ గురించి త‌న త‌ల్లి శివ‌కుమారి బెంగ పెట్టుకున్న‌ట్లు వార్తాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

  ప్ర‌భాస్ పెళ్లి గురించే త‌న త‌ల్లి బాధ ప‌డుతుంద‌ట‌. కేవ‌లం త‌న కుటుంబ‌స‌భ్యులే కాదు ఆయ‌న అభిమానులు కూడా త‌న పెళ్లి గురించే చింతిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్‌కు ఎన్నోసార్లు త‌న పెళ్లి గురించి ఎన్నో ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. కానీ ప్ర‌భాస్ ఎప్పుడు ఏదో ఒక విషయం చెబుతూ త‌ప్పించుకున్నాడు. ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్‌, రాధేశ్యామ్‌, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here