పుష్ప నుంచి హాట్ యాంక‌ర్ అన‌సూయ మాస్ లుక్‌..

  165
  0
  Hot Anasuya

  ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌, డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో,బ‌న్నీకి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ‘పుష్పరాజ్’ గా బన్నీ లుక్ వదిలిన కొంత గ్యాప్ తరువాత ఫాహద్ ఫాజిల్ లుక్ ను వదిలారు. ఆ తరువాత శ్రీవల్లి గా రష్మిక లుక్ ను రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా ‘మంగళం శ్రీను’ పాత్రలో సునీల్ ను పరిచయం చేస్తూ ఆయన లుక్ ను రివీల్ చేశారు.

  సునీల్ ను ఆ తరహా లుక్ తో ఊహించని నెటిజన్లు షాక్ అయ్యారు. సునీల్ పాత్ర ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలోను పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ‘దాక్షాయణి’ పాత్రలో అనసూయను పరిచయం చేస్తూ ఆమె లుక్ ను వదిలారు. ఈ పోస్టర్లో అనసూయ మాస్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె లుక్స్ ను బట్టి ఆమె పోషించినది నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర అనిపిస్తోంది.

  మరి ఈ లుక్ తో తెరపై ఆమె ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తుందో చూడాలి. ‘రంగస్థలం’లో అందమైన రంగమ్మత్తగా ఆమెను చూసిన ప్రేక్షకులకు, ఆమెను ఇలా చూడటం మరింత కొత్తగా అనిపిస్తుంది. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here