బాలీవుడ్ సెన్సెష‌న్ హాట్ బ్యూటీ త్వ‌ర‌లో టాలీవుడ్ ఎంట్రీ!

  91
  0
  mallika sheravath

  బాలీవుడ్ లో ఒకప్పుడు హాట్ సెన్సేషన్ అయిన బ్యూటీ మల్లికా షెరావత్. వాస్తవానికి ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. సౌత్ లో ఆమె ఆరాధకులు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది మల్లికా. జాకీ చాన్ “ది మిత్” సినిమాలో మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది.

  అంతేకాదు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నేళ్లకు టాలీవుడ్ అరంగ్రేటం చేయబోతోంది. పీరియాడిక‌ల్ డ్రామా కథాంశంతో తెరకెక్కే ఈ చిత్రం పేరు ‘నాగమతి’. అమ్రిష్ గణేశ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్త వేడుక ఇటీవల ముంబైలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించ‌నున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here